పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెంలో అధికారులు తమ్మిలేరు జలాశయం యొక్క మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం యొక్క నీటి నిల్వ సామర్థ్యం 355 అడుగులు కాగా ప్రస్తుతం 349 అడుగుల మేర నీరు చేరింది. దీంతో రిజర్వాయర్‌కు ఉన్న మూడు గేట్లు నుండి 2,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ముందుగా మొదటి గేట్ నుంచి 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా... క్రమేపి మిగిలిన రెండు గేట్ల నుంచి 1900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని అధికారులు తెలిపారు. తెలంగాణ నుంచి వరద నీరు భారీగా వస్తుండటంతో ప్రస్తుతం జలాశయంలో 349 అడుగుల నీటిని నిల్వ ఉంచి మిగులు జలాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
తమ్మిలేరు జలాశయం మూడు గేట్ల ఎత్తివేత - heavy rain west godavari district
పశ్చిమగోదావరి జిల్లాలోని తమ్మిలేరు జలాశయానికి బారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు తెలంగాణ నుంచి భారీగా వరద నీరు రావటంతో అధికారులు జలాశయం మూడు గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు.
తమ్మిలేరు జలాశయం మూడు గేట్ల ఎత్తివేత