ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షం - పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షం

పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్ సాగు ముందుకు సాగడం లేదని రైతులు వాపోతున్నారు.

heavy rain in west godavari district
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షం

By

Published : Jul 28, 2020, 3:39 PM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం, ఉండ్రాజవరం, అత్తిలి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నారుమడులు కుళ్లిపోతున్నాయని, పంటసాగు ఆలస్యం అవుతోందని రైతులు వాపోతున్నారు. నారుమడుల్లో వర్షపు నీరు నిలుస్తుండటంతో నీటిని తోడిపోసేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: మద్యం దుకాణం వద్ద మందుబాబుల బారులు

ABOUT THE AUTHOR

...view details