పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ, మెట్ట మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, లక్కవరం, గురవాయగూడెం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. లక్కవరంలో ఇంటిపై తాటిచెట్టు పడింది. ఇంట్లో ఉన్న నిండు గర్భిణితో సహా మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. గురవాయగూడెంలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జంగారెడ్డిగూడెం పట్టణంలో దుకాణాలు ముందు ఉన్న హోర్డింగులు, ప్రకటన బోర్డులు ఎగిరిపడ్డాయి. అనేక చోట్ల మామిడి, జీడీ మామిడి కాయలు నేలరాలాయి.
ఈదురు గాలులతో భారీ వర్షం... కూలిన విద్యుత్ స్తంభాలు - ఏపీలో భారీ వర్షం
రాష్ట్రంలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పశ్చిమగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో విద్యుత్ స్తంభాలు, తాటిచెట్లు, హోర్డింగులు నెలకొరిగాయి.
heavy rain in west godavari