వాయుగుండం ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్వారకాతిరుమలలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పోలీస్ స్టేషన్ లోపలికి వరద నీరు వచ్చిచేరింది. స్థానిక సంత మార్కెట్ వద్ద ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. మండలంలో దేవినేనివారిగూడెం వద్ద గుర్రాల వాగు ఉద్ధృతంగా ప్రవహించటంతో.. రహదారిపై ఉన్న కల్వర్టు కొట్టుకుపోయింది. గుర్రాలవాగు ఉద్ధృతికి వీరిశెట్టిగూడెం-తిమ్మాపురం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటకృష్ణాపురం బీసీ కాలనీలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
గుర్రాలవాగు ఉద్ధృతికి కొట్టుకుపోయిన కల్వర్టు - ద్వారకాతిరుమలలో భారీ వర్షం వార్తలు
ద్వారకా తిరుమలలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
heavy rain in dwaraka