పశ్చిమ గోదావరి జిల్లాలో తెల్లవారుజాము నుంచి పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భీమవరం, పాలకొల్లు, ఆచంట, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. పలు గ్రామాలు, పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు, వీధులు, రహదారులు జలమయమయ్యాయి. తణుకు, పెనుమంట్ర, పోడూరు, వీరవాసరం, పెనుగొండ, ఆచంటలో 90మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 50మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సాగుకు ఈ వర్షం ఉపయోగపడుతుందని రైతులు ఆనందిస్తున్నారు. మరో వైపు ఆచంటలో వరి పొలాలు మూడు అడుగుల మేర మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరవాసరం మండలం కొణితివాడ బాలికల వసతి గృహంలోకి భారీగా నీరు చేరింది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం
పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పశ్చిమ గోదవరిలో భారీ వర్షం