రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రిజర్వాయర్లలో వరద ప్రవాహం అధికంగా ఉంటోంది. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధిక వర్షాల కారణంగా పలుచోట్ల వాగులు,పొంగిపొర్లుతున్నాయి. కన్నాపురం వద్ద కొండవాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొవ్వాడ, ఎర్రకాలువ, జల్లేరు, పొగొండ, చింతలగూడెం జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయు
భారీ వర్షాలకు నిండుకుండను తలపిస్తున్న రిజర్వాయర్లు
గతకొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి . తాజాగా పశ్చిమగోదావరి జిల్లా రెండురోజులుగా కురుస్తున్న అధిక వర్షాలకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షాలకు నిండుకుండను తలపిస్తున్న రిజర్వాయర్లు.