భారీగా గంజాయి పట్టివేత - Heavy marijuana possession at west godavari district
లారీలో భారీగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లా కైకరం వద్ద లారీలో తరలిస్తున్న గంజాయిని చేబ్రోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాపై విశ్వసనీయ సమాచారం రావడంతో చేబ్రోలు ఎస్సై వీర్రాజు తన సిబ్బందితో కైకరం వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా ఒక లారీని తనిఖీ చేయగా భారీగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. విశాఖపట్నం నుంచి తమిళనాడుకు తరలిస్తున్న గంజాయితోపాటు లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 200 ప్యాకెట్లలో ఉన్న గంజాయి 450 కేజీల పరిమాణం ఉంది. కేసుకు సంబంధించిన వివరాలను చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో జిల్లా అదనపు ఎస్పీ కరీముల్లా వెల్లడించారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు. లారీ డ్రైవర్ తంగవేలి రాము ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.