ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద - తమ్మిలేరు జలాశయం

తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద నీరు వస్తుండటంతో...అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇలాగే కొనసాగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Heavy flooding of Tammileru reservoir
తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద

By

Published : Oct 13, 2020, 5:25 PM IST

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద నీరు వస్తుండటంతో...అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ నుంచి వరదనీరు 11వేల క్యూసెక్కులు వస్తుండగా 9 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరిస్థితి కొనసాగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. ఏలూరులోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో నీటిని విడుదల చేస్తున్నారు. తమ్మిలేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:

వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details