పోలవరంపై ఎన్జీటీలో విచారణ - ap state
పోలవరం వ్యర్థాల డంపింగ్ కేసుపై ఎన్జీటీలో విచారణ జరిగింది. డంపింగ్ తప్పులను నెలలో సరిదిద్దాలని పోలవరం అథారిటీని ఎన్జీటీ ఆదేశింది. తదుపరి విచారణ మే 10కి వాయిదా వేసింది.
పోలవరం వ్యర్థాల డంపింగ్ కేసుపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో విచారణ జరిగింది. ఎన్జీటీ ప్రధాన న్యాయమూర్తి ఏకే గోయల్ ధర్మాసనం ఈ కేసును విచారించింది. డంపింగ్ తప్పులను నెలలో సరిదిద్దాలని పోలవరం అథారిటీని ఎన్జీటీ ఆదేశింది. ప్రాజెక్టు అథారిటీ తీసుకున్న చర్యలపై నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పర్యావరణానికి ఎంత నష్టం జరిగిందో అంచనా వేయాలని సూచించింది. తదుపరి విచారణ మే 10కి వాయిదా వేసింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పర్యావరణానికి నష్టమని పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.