ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరీక్షల నుంచి చికిత్స వరకూ ఉపయోగపడేలా.. 104 కాల్​ సెంటర్' - ఏలూరు కలెక్టరేట్​లో మంత్రి ఆళ్ల నాని

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్​ను.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని సందర్శించారు. కొవిడ్ నిర్ధరణ పరీక్షల నుంచి చికిత్స వరకు ప్రతి విషయంలో కరోనా బాధితులకు ఈ కాల్ సెంటర్ ఉపయోగపడుతుందని తెలిపారు.

minister alla nani, minister visited 104 call center in eluru
మంత్రి ఆళ్ల నాని, ఏలూరులో 104 కాల్ సెంటర్​

By

Published : Apr 24, 2021, 5:51 PM IST

ఏలూరులో కలెక్టరేట్​లో 104 కాల్​ సెంటర్

కొవిడ్ చికిత్సలో 104 కాల్ సెంటర్ కీలకపాత్ర పోషించనుందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్​ను ఆయన పరిశీలించారు. కొవిడ్ పరీక్ష నుంచి చికిత్స వరకు ఈ కాల్ సెంటర్ ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పారు.

ప్రతి జిల్లాలోనూ 104 కాల్ సెంటర్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తామని తెలిపారు. ఆయా జిల్లాల్లో ఆక్సిజన్ నుంచి కొవిడ్ మందుల వరకు అన్ని విభాగాలకు నోడల్ అధికారులు నియమించి.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details