ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హనుమాన్​ స్మరణలో పశ్చిమగోదావరి జిల్లా - ap latest

పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో హనుమాన్​ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాలంగి ఆంజనేయ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. పెరవలి దేవాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

హనుమాన్​ స్మరణలో పశ్చిమగోదావరి జిల్లా

By

Published : May 29, 2019, 6:17 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో హనుమాన్​ జయంతి వేడుకలు
పశ్చిమగోదావరి జిల్లాలో హనుమాన్​ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు గ్రామాల్లోని ఆంజనేయ ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఉండ్రాజవరం మండలం పాలంగిలోని స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. పెరవలి జాతీయ రహదారి పక్కన గల అభయాంజనేయ ఆలయంలో లక్ష తమలపాకులతో పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం గుర్వాయగూడెంలో స్వామి వారిని వేకువ జామునే పంచామృతాలతో అభిషేకించారు. వడమాలలు సమర్పించారు. అన్నదానం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details