రాష్ట్ర వ్యాప్తంగా చేనేత సహకార సంఘాల్లో పేరుకుపోయిన వస్త్ర నిల్వలకు మోక్షం కలగనుంది. ఆగస్టు మొదటి వారంలో వస్త్రాలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 980 చేనేత సహకార సంఘాలు ఉండగా.. వీటిలో ప్రస్తుతం 430 సంఘాలు మాత్రమే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. చేనేత సహకార సంఘాలలో తయారైన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయించి అమ్మేవారు. లాక్డౌన్తో ఈ సంఘాల్లో తయారు చేసిన 25 కోట్ల రూపాయల విలువైన వస్త్రాలు పేరుకుపోయాయి. లాక్డౌన్ ప్రారంభం నాటికి 50 శాతం పైగా నిల్వలు ఉండగా.. తర్వాత కాలంలో మరికొన్ని నిల్వలు పెరిగాయి.
బకాయిలు రాక ఇబ్బందులు
పశ్చిమగోదావరి జిల్లాలో 23 చేనేత సహకార సంఘాలు ఉండగా 10 సంఘాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంఘాల పరిధిలో 40 నుంచి 45 లక్షల రూపాయల విలువైన వస్త్ర నిల్వలు ఉన్నాయి. వస్త్ర నిల్వలు పెరిగిపోవటం.. గతంలో ఆప్కో నుంచి రావాల్సిన బకాయిలు రాకపోటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సహకార సంఘాలు చెబుతున్నాయి.
ఆగస్టులో చేనేత వస్త్రాల కొనుగోళ్లు - west godavari news latest
చేనేత వస్త్రాలు తయారీ చేసే వారి కష్టాలపై అధికారులు స్పందించారు.. లాక్డౌన్ కారణంగా చేనేత వస్త్ర కార్మికుల ఇళ్లల్లో తయారై ఉన్న వస్త్రాలను సొసైటీలకు ఇస్తే.. అక్కడి నుంచి కొనుగోలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఆగస్టులో ప్రారంభంకానున్న చేనేత వస్త్రాల కొనుగోళ్లు
Last Updated : Jul 27, 2020, 7:04 PM IST