పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇటీవల స్వర్గస్తులైన మాజీమంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు కుటుంబాన్ని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు పరామర్శించారు. మాణిక్యాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాణిక్యాలరావుతో గల అనుభవాలను ఆదర్శ భావాలను పాత్రికేయుల ముందు తెలియజేశారు.
మాణిక్యాలరావు కుటుంబాన్ని పరామర్శించిన జీవీఎల్ - పశ్చిమ గోదావరి జిల్లా
ఇటీవల స్వర్గస్తులైన మాజీమంత్రి, భాజపా నేత పైడికొండల మాణిక్యాలరావు కుటుంబాన్ని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు పరామర్శించారు.
పశ్చిమగోదావరి జిల్లా కోసం, తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన మాణిక్యాలరావు అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, బ్యాలెన్స్ డ్గా ఉంటూ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి మాణిక్యాలరావు అని కొనియాడారు. ఎప్పుడు ప్రజా సంక్షేమం కోసం, తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం మాత్రమే మాట్లాడేవారని.. తన స్వలాభం కోసం ఏనాడు మాట్లాడలేదని పేర్కొన్నారు. మాణిక్యాలరావు అకాల మరణం తమకు, పార్టీకి తీరని లోటు అని జీవీఎల్ నరసింహారావు అన్నారు.
ఇదీ చదవండి జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు సడలింపు