ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - తాడేపల్లిలో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లా నుంచి గుంటూరుకు అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను తాడేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యాపారులపై కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు.

gutka packets seized in tadeapally at west godavari
అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

By

Published : May 13, 2020, 6:29 PM IST

పశ్చిమదావరి జిల్లా నుంచి గుంటూరుకు అక్రమంగా తరలిస్తున్న రూ.7లక్షలు విలువైన గుట్కా ప్యాకెట్లను... తాడేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి వద్ద పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఓ వాహనంలో అరటికాయలు తరలిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు దానిని తనిఖీ చేశారు. వాహనంపై భాగంలో అరటి గెలలు, మధ్యలో అట్టపెట్టెలాంటివి కనిపించగా పోలీసులు దానిని విస్తృతంగా తనిఖీ చేశారు. అందులో నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో శ్రీనివాస్, బ్రహ్మం అనే వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

800 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details