ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమ్మఒడి'పై ఏలూరు కలెక్టరేట్​లో గ్రీవెన్స్..! - Grevens in Eluru Collectorate for those who do not have a ammavodi

రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు అభివృద్ధి కోసం ప్రారంభించిన అమ్మఒడి పథకంలో లబ్ధి చేకూరని తల్లుల కష్టాలు వర్ణనాతీతం. ఈ పథకం ద్వారా చాలా కుటుంబాలు లబ్ధి పొందగా... కొందరు మాత్రం అర్హులైనప్పటికీ వివిధ కారణాలతో అందుకోలేకపోయారు. వారంతా తమకు కూడా ఈ పథకం లబ్ధిని అందించాలంటూ 'స్పందన' కార్యక్రమంలో వినతులు అందజేశారు. ఈ పరిస్థితిని గమనించిన పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు అమ్మఒడి పథకానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఏలూరులోని కలెక్టరేట్​లో గ్రీవెన్స్ నిర్వహించారు.

Grevens in Eluru Collectorate for those who do not have a ammavodi
అమ్మఒడి అందని వారికి ఏలూరు కలెక్టరేట్​లో గ్రీవెన్స్

By

Published : Mar 6, 2020, 4:52 PM IST

అమ్మఒడి అందని వారికి ఏలూరు కలెక్టరేట్​లో గ్రీవెన్స్

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి 5,44,147 మంది అర్హులు కాగా వీరిలో 3,33,056 మంది అర్హుల జాబితాలో ఉన్నారు. వీరిలో 70,999 మంది బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ కాలేదు. మిగిలిన వారి బ్యాంకు ఖాతాల్లో 15 వేల రూపాయల చొప్పున ఇంతవరకు రూ.507.08 కోట్లు జమ అయినట్లు గణంకాలు చెబుతున్నాయి.

కలెక్టరేట్ వద్ద గందరగోళం...

అమ్మ ఒడి పథకానికి అర్హత కలిగి ఉండి కూడా లబ్దిపొందలేక పోయినవారు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం నకలు తదితర ధ్రువపత్రాలతో గ్రీవెన్స్​కి రావాలని అధికారులు సూచించారు. పెద్ద సంఖ్యలో ఏలూరు కలెక్టర్​కు లబ్ధిదారులు వచ్చారు. అక్కడ దరఖాస్తులను ఎవరికి ఇవ్వాలో తెలియక నానా కష్టాలు పడ్డారు. చాలామంది చదువు రాక దరఖాస్తుల ఎలా పూర్తి చేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధిక సంఖ్యలో లబ్ధిదారులు రావడంతో కంట్రోల్ చేయడం అధికారులకు కష్టతరంగా మారడంతో...వారందరినీ బయటకు పంపించేశారు. అధికారులకు ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి మండలాల్లో వాలంటీర్లు సచివాలయం దగ్గర దరఖాస్తులు తీసుకుని... అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా ఈ పథకం వర్తింపు చేసేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఇవీ చదవండి...దిశ కేసుల కోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక న్యాయస్థానాలు: డీజీపీ

ABOUT THE AUTHOR

...view details