పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం అలుగులగూడెం గ్రామంలో తాత, మనవడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గ్రామానికి చెందిన కమ్ముల నంబూద్రి పాల్(65) అద్విక్ (6)తాతామనవళ్లు. శుక్రవారం రాత్రి వీరిద్దరూ కడుపునొప్పి వస్తోందని, కడుపులో పట్టేసినట్లుగా ఉందని చెప్పడంతో వారిని కుటంబ సభ్యులు దెందులూరులోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.
అనుమానాస్పద స్థితిలో తాత, మనవడు మృతి.. అసలేం జరిగింది? - granda father and son suspicious death news
07:28 October 23
దెందులూరు మం. అలుగులగూడెంలో ఘటన
మార్గం మధ్యలో అద్విక్ నోరు, ముక్కు నుంచి నురగలు వచ్చాయి. నంబూద్రి ప్రసాద్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దెందులూరులోని ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అనంతరం.. వారిని 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు.. వారు మృతిచెందినట్లు ధ్రువీకరించారు.
పాము కాటేనా..?
బాధితులను ఆస్పత్రికి తరలించిన సమయంలో.. కుటుంబ సభ్యులు ఇంటివద్ద పామును గుర్తించారు. పాముకాటు వల్లే వారిద్దరు మృతి చెంది ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తాత, మనవడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:Fire Accident: కారులో చెలరేగిన మంటలు..తప్పిన ప్రాణ నష్టం