తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయనకు పెరవలిలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో కార్తకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్వగ్రామం కొమ్ముచిక్కాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇటీవల పితాని కుమారుడి వివాహం జరగ్గా.. చంద్రబాబు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో నూతన దంపతులను ఆశీర్వదించేందుకు ఆయన పితాని సత్యనారాయణ ఇంటికి వెళ్లారు.
పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబుకు ఘనస్వాగతం - chandra babu west godavari tour latest news
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఘనస్వాగతం లభించింది. పెరవలిలో మాజీ శాసనసభ్యుడు బూరుగుపల్లి శేషారావు, పార్టీ కార్యకర్తలతో కలిసి స్వాగతం పలికారు.
![పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబుకు ఘనస్వాగతం grand welcome to chandra babu at peravali west godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10325002-271-10325002-1611227094727.jpg)
grand welcome to chandra babu at peravali west godavari district
పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబుకు ఘనస్వాగతం