జిల్లాలో 11 లక్షల 73 వేల 400 పాత రేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేశారు. జిల్లాలో కొత్తగా మంజూరు చేసిన బియ్యం కార్డులు 11 లక్షల 44 వేల 872 మంది వద్ద మాత్రమే ఉన్నాయి. వీరికి మాత్రమే ప్రత్యేక ఆర్థిక సాయం అందనుంది. ఉచితంగా బియ్యం, కందిపప్పు పొందిన వారిలో 28, 528 మంది లబ్ధిదారులు ప్రత్యేక ఆర్థిక సాయం పొందేందుకు దూరమవుతున్నారు. గ్రామ వార్డు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబ యజమాని లేదా సభ్యుల్లో ఎవరో ఒకరి ఫొటోను తీసుకుని ఆర్థిక సాయం అందించనున్నారు. పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా అధికారులు స్పష్టం చేశారు.
ఆర్థిక సాయానికి దూరం కానున్న 28,528 మంది! - latest ration cards in west godavari
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ తోపాటు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. సరుకుల పంపిణీకి పాత రేషన్ కార్డులను ప్రాతిపదికన తీసుకోగా... ఆర్థిక సాయానికి వైకాపా అధికారంలోకి వచ్చాక జారీ చేసిన బియ్యం కార్డులను ప్రామాణికంగా తీసుకోనున్నారు.
జిల్లాలో ప్రత్యేక ఆర్థిక సాయానికి దూరమవ్వనున్న 28వేల 528 మంది