ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Governor Dattatreya: సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించుకోవాలి: గవర్నర్ దత్తాత్రేయ - గవర్నర్ బండారు దత్తాత్రేయ

Governor Bandaru Dattatreya at Gopalapatnam: మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించుకోవాలని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపినాథపట్నంలో నూతనంగా నిర్మించిన విశ్రాంతి భవనాన్ని దత్తాత్రేయ ప్రారంభించారు.

Governor Dattatreya
Governor Dattatreya

By

Published : Jan 8, 2022, 7:33 PM IST

Updated : Jan 8, 2022, 10:34 PM IST

Governor Bandaru Dattatreya at Gopalapatnam: పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గోపినాథపట్నంలో రూ.కోటి వ్యయంతో నిర్మించిన విశ్రాంతి భవనాన్ని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. నిడమర్రు మండలం పత్తేపురానికి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఛైర్మన్​ పత్సమట్ల ధర్మరాజు సహకారంతో ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ విశ్రాంతి భవనం నిర్మించారు. దీనిలో భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు.

Governor Bandaru Dattatreya in Sankranti celebration: అనంతరం శ్రీలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉంగుటూరులో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో గవర్నర్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో మెలగాలన్నారు. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. కొవిడ్ మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేసిందని.. కుల మతాలకు అతీతంగా అందించిన సేవలు అభినందనీయమన్నారు.

కొవిడ్ టీకా వేయించుకున్న వారి సంఖ్య 150 కోట్లు దాటడం దేశానికే గర్వ కారణమన్నారు. సేవా భావంతో భక్తుల సౌకర్యం కోసం ముందుకొచ్చిన శ్రీ లక్ష్మీ ఫౌండేషన్ ఛైర్మన్​ ధర్మరాజు, డైరెక్టర్లకు దత్తాత్రేయ అభినందించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీ రాణి, తదితరలు పాల్గొన్నారు.

అల్లూరి విగ్రహ ఏర్పాటుకు కృషి..

అల్లూరి సీతారామరాజు స్వగ్రామం మోగల్లులో గవర్నర్ దత్తాత్రేయ పర్యటించారు. అల్లూరి నివాస ప్రాంతంలో మొక్క నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.."అల్లూరి స్వగృహ నిర్మాణానికి నావంతు సహకారమందిస్తాను. మోగల్లు.. దేశచరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. పార్లమెంటులో అల్లూరి విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తాను. అల్లూరి, చంద్రబోస్ వంటి మహనీయులను దేశం మరచిపోదు. త్యాగాలు, దానాలు, కవులు, కళాకారుల పుట్టినిల్లు ప.గో. జిల్లా" అని అన్నారు.

దత్తాత్రేయకు ఘన స్వాగతం..

అంతకుముందు.. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఘన స్వాగతం లభించింది. దిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్న దత్తాత్రేయకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు.

ఇదీ చదవండి..

Farmers Agitation at Velugodu: సాగునీరు ఇవ్వాలని వెలుగోడులో రైతుల ఆందోళన

Last Updated : Jan 8, 2022, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details