పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు మట్టితో వినాయక ప్రతిమలు తయారు చేశారు. సెప్టెంబర్ 2న జరిగే వినాయకచవితి నాడు.. ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను వాడాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడు కెన్. వి. గణేష్ పర్యవేక్షణలో విద్యార్థులు ఈ ప్రతిమలను రూపొందించారు. ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో జరిగే వినాయక చవితిపూజను మట్టి విగ్రహాలతో చేసుకోవడం ద్వారా పర్యావరణాన్ని కాపాడచ్చునని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీరు, వాతావరణం కలుషితం అవుతాయన్నారు.
మట్టి వినాయకులే మేలు!
గోపన్నపాలెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు.. మట్టితో వినాయక ప్రతిమలు తయారు చేశారు.
Government high school students in Gopanna Pallem have made statues of Ganesha with clay.