పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గ్రామానికి చెందిన ఓ మహిళకు నెలలు నిండాయని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అధిక ఫీజు కట్టలేక ఓ ప్రభుత్వ వైద్యురాలిని సంప్రదించారు. ఆమె తక్కువ ఖర్చులో వైద్యం చేస్తానని చెప్పటంతో బాధితులు వైద్యం చేయించుకున్నారు.
ప్రభుత్వ వైద్యురాలు తన నివాసం వద్దనే శస్త్ర చికిత్స నిర్వహించి శిశువును బయటకు తీశారు. శస్త్ర చికిత్స చేసిన సమయంలో కొన్ని అవకతవకలు జరగటంతో బాలింతరాలి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషయం గ్రహించిన వైద్యురాలు బాలింతరాలిని హుటాహుటిన కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవటంతో బాలింతరాలు మృతి చెందింది.