కరోనా వ్యాప్తితో లాక్డౌన్ అమలు కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను గుర్తించి ప్రభుత్వం వారి స్వస్థలాలకు చేరుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, యలమంచిలి మండల పరిధిలోని 411 మంది వలస కూలీలను వారి స్వస్థలాలు అయిన.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చేర్చేందుకు నరసాపురం డిపో నుండి ప్రత్యేకంగా 16 బస్సులను ఏర్పాటు చేశారు.
వలస కార్మికులు స్వస్థలాలు చేరే వరకు అవసరమైన ఆహారం, తాగు నీటిని అధికారులు సమకూర్చారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన జిల్లా వాసులను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామమని స్థానిక ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు తెలిపారు.