పాక్ కు సరైన బుద్ధి చెప్పారు - వాకర్స క్లబ్
భారత వాయుసేనలు చేపట్టిన మెరుపుదాడులను అభినందిస్తూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు.
వాకర్స క్లబ్ సభ్యల ప్రదర్శన
ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేనచేపట్టిన మెరుపు దాడులను అభినందిస్తూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి నెహ్రూ బజార్ కూడలిలో బాణా సంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల్ని తుదముట్టించడమే కాకుండా వారిని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు సరైన బుద్ధి చెప్పారన్నారు.