రుణాలు ఇప్పిస్తామని చెప్పి.. నగలు చోరీ - dwakra
రుణాలు ఇప్పిస్తామని వచ్చిన ఇద్దరు అగంతకులు.. ఓ మహిళను మోసగించారు. 6.8 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా కాపవరం గ్రామానికి చెందిన అనంతలక్ష్మి ఇంటికి వెళ్లిన ఇద్దరు అగంతకులు... డ్వాక్రా కార్యాలయం నుంచి వచ్చామని పరిచయం చేసుకున్నారు. లక్ష రూపాయలు రుణం వస్తుందని... ఇందుకు ఫోటోలు అవసరమని చెప్పారు. బంగారు ఆభరణాలు ధరించి ఫోటోలు దిగితే రుణం రాదని మభ్యపెట్టారు. నిజమేనని నమ్మిన బాధితురాలు... ఆభరణాలు తీసి పక్కన పెట్టింది. నిందితుల్లో ఒకరు ఫోటో తీస్తున్నట్టు నటిస్తుండగా... మరొకరు ఆభరణాలను దొంగిలించారు. అనంతరం ఇద్దరు ద్విచక్రవాహనంపై ఉడాయించారు. బాధితురాలు అనంతలక్ష్మి.... పెరవలి పోలీసులను ఆశ్రయించించగా.... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.