దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని గోస్తనీ తీరాన వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారు... సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
జ్ఞానానికి అధిష్టాన దేవతగా తారాహారాలు కంఠాభరణాలుగా ధరించిన అమ్మవారిగా, జ్ఞాన ప్రదాయినిగా... భక్తులు నమ్ముతారు. శ్వేత వస్త్రధారణతో మయూర వాహనంపై అధిరోహించి, వీణాపాణిగా, చదువుల తల్లిగా దర్శనమిస్తున్న అమ్మవారిని... అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.