కృష్ణమ్మ చెంతకు గోదావరి జలాలు
ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి నదికి ఇన్ఫ్లో పెరుగుతోంది. గోదావరి నుంచి కృష్ణలోకి పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేశారు.
పట్టిసీమ
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణానదికి నీటిని విడుదల చేశారు. పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను వదిలారు. మొత్తం 16 పంపుల నుంచి 5 వేల 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో నీటిమట్టం పెరుగుతోంది. ఈ కారణంగానే.. కృష్ణానదికి నీటిని విడుదల చేస్తున్నామన్నారు.