ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదారమ్మ పరవళ్లు.. పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా వరద నీరు - గోదావరి వరద నీరు తాజా వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు వచ్చి చేరుతోంది.

godavari floods to polavaram project
godavari floods to polavaram project

By

Published : Aug 11, 2020, 8:43 PM IST

Updated : Sep 18, 2020, 2:06 PM IST

పోలవరం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యామ్ నదికి అడ్డుగా ఉండటంతో వరద నీరు ప్రాజెక్ట్ స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానల్ కు చేరుకుంది. ప్రస్తుతం పోలవరంలో గోదావరి వరద 8.45 మీటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రోజురోజుకు నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ముంపు గ్రామాలను ముందుగానే నిత్యావసర సరకులను పంపినట్లు ఐటీడీఏ పీవో సూర్యనారాయణ తెలిపారు. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ముంపు ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచామన్నారు.

Last Updated : Sep 18, 2020, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details