ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం వద్ద గోదావరి వరద... నిలిచిన పనులు - polavaram

పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద కారణంగా నది మధ్య భాగంలో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మరో రెండురోజులు వరద కొనసాగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

పోలవరం వద్ద గోదావరి వరద

By

Published : Jul 9, 2019, 7:10 AM IST

పోలవరం వద్ద గోదావరి వరద

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణమైన కాపర్ డ్యామ్​పై నుంచి వరద పొంగి పొర్లుతోంది. 3రోజులు క్రితం (పోలవరం ప్రాజెక్ట్ అథార్టీ) పీపీఏ కమిటీ పనులను పరిశీలించింది. వరదలు వస్తే ఎగువ ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా... ఎగువ కాపర్ డ్యామ్ ఎడమ వైపు 3మీటర్లు ఎత్తు పెంచాలని పీపీఏ కమిటీ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించింది. కానీ అనుకోని విధంగా వరద రావడంతో నది మధ్య భాగంలో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రవాహం మరో 2రోజులు కొనసాగవచ్చని కేంద్ర జలసంఘం కమిటీ అచనా వేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details