ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్లలోకి వరద.. ఇబ్బందుల్లో మత్స్యకారులు - పల్లెపాలెంలోకి చేరిన వరదనీరు వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పల్లెపాలెంలోకి వరదనీరు పోటెత్తింది. ఇళ్లలోకి నీరు చేరటంతో తమ సామాన్లను ప్రజలు గట్టు మీదకు చేరవేస్తున్నారు. ఏటా వరదలు వచ్చినప్పుడల్లా తమ పరిస్థితి ఇలానే ఉంటోందని బాధితులు వాపోతున్నారు.

godavari flood water in pallepalem village west godavari district
ఇళ్లలోకి చేరిన వరదనీరు

By

Published : Aug 17, 2020, 4:59 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పల్లెపాలెంలోకి వరద నీరు చేరింది. ఆ ప్రాంతంలో మత్స్యకారులు నివాసం ఉంటున్నారు. వరదతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఏటా వరదలు వచ్చినప్పుడల్లా తమ పరిస్థితి ఇలానే ఉంటోందని వాపోతున్నారు. ఇళ్లలోకి నీరు చేరిన కారణంగా సామాన్లు గట్టు మీదకు చేర్చారు. బాధితులకు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అధికారులు ఆశ్రయం కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details