పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి నది వద్ద నెక్లెస్ బండ్ ప్రమాదకరంగా మారింది. జిల్లా యంత్రాంగం హుటాహుటిన పోలవరం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ఈ నాగిరెడ్డి, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్నలక్ష్మీ, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరం చేరుకుని వరదపై సమీక్షించారు. ఆంజనేయస్వామి ఆలయం వద్ద నెక్లెస్ బండ్ అత్యంత ప్రమాదకరంగా మారగా సమీపంలో ఉన్న కమ్మరగూడెం, నూతనగూడెం, యడ్లగూడెం, కృష్ణాపురం వీధుల ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందస్తు చర్యగా ఇసుక బస్తాలు వేస్తున్నారు.
గోదావరి వరద.. ప్రమాదకరంగా మారిన నెక్లెస్ బండ్ - gadavari floods latest news
పోలవరంలో గోదావరి నది వద్ద నెక్లెస్ బండ్ ప్రమాదకరంగా మారింది. కలెక్టర్ ముత్యాలరాజు, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, అధికారులు వరద పరిస్థితిని సమీక్షించారు. సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
గోదావరి వరద.. ప్రమాదకరంగా మారిన నెక్లెస్ బండ్