గోదావరిలో నెమ్మదిగా వరద ఉద్ధృతి తగ్గుముఖంపడుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 11.6 అడుగుల నీటిమట్టం ఉంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. సముద్రంలోకి 9.75 లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విలీన మండలాల్లో నెమ్మదిగా వరద ప్రభావం తగ్గుతోంది. కోనసీమ లంక గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి.
Godavari floods: గోదావరిలో నెమ్మదిగా తగ్గుతున్న వరద - water level at polavaram
గోదావరిలో నెమ్మదిగా వరద ఉద్ధృతి తగ్గుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్టు వద్దా.. గోదావరి ప్రవాహం శాంతించింది.
Godavari floods
పోలవరం ప్రాజెక్టు వద్దా.. గోదావరికి వరద ఉద్ధృతి తగ్గింది. పోలవరం ప్రాజెక్టు ఎగువ స్పిల్ వే వద్ద నీటిమట్టం 33 మీటర్లు నమోదైంది. స్పిల్ వే 48 గేట్ల ద్వారా 9 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.