గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద 48 అడుగులకు పైగా చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు దిగువకు వస్తుండడంతో పశ్చిమగోదావరి జిల్లాలోని గోదావరి తీర ప్రాంత గ్రామాలు వణుకుతున్నాయి. పెరవలి మండలం తీపర్రు, కాకర పర్రు తదితర గ్రామాల వెంబడి గోదావరి ఏటిగట్టున అనుకొని ప్రవహిస్తోంది. ఈ ఉధృతి మరింత పెరిగితే తమని ఎక్కడ ముంచెత్తుతుందోనని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఉద్ధృతంగా గోదావరి..భయాందోళనలో తీరప్రాంత ప్రజలు
పశ్చిమగోదావరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తీర ప్రాంతాల్లోని ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. వరద పోటెత్తడంతో కొద్దిపాటి కూరగాయ తోటలకు నష్టం వాటిల్లింది. గోదావరి మరింత పెరిగితే అరటి తోటలు సైతం మునిగిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరద ఎఫెక్ట్: భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ