పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి వరద ప్రవాహం పోటెత్తుతోంది. పోలవరం కడెమ్మ వంతెన పైకి వరద నీరు భారీగా చేరుకోవడంతో పాత పోలవరం నది సమీపంలోని నివాస ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ స్పీల్ వే వద్ద వరద భారీగా చేరుకుంటుంది.
పోలవరంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి - పోలవరంలో గోదావరి వరద ప్రవాహం
జిల్లాలో రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీవర్షాల కారణంగా పోలవరంలో గోదావరి ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. పాత పోలవరం సమీపంలో నివసిస్తున్న ప్రజలు భయందోళనలో ఉన్నారు. అధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
పోలవరంలో గోదావరి వరద ప్రవాహం