పశ్చిమగోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి ఉరకలు పెడుతోంది. ఎగువన భారీ వర్షాలు కురవడంతో గోదావరిలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే పోలవరం మండలం కొత్తూరు కాజ్వే వద్ద 10 అడుగుల మేర వరద నీరు చేరుకోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచాయి. పోలవరంలో వరదకు రక్షణగా ఉన్న నెక్లెస్ బండ గోదావరిలోకి జారిపోతోంది. వరద పరిస్థితిని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. వరద గ్రామంలోకి రాకుండా బండరాళ్లను అడ్డుగా వేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు జాయింట్ కలెక్టర్కు తెలిపారు. వరద ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచించారు.
పోలవరం దగ్గర కొనసాగుతున్న గోదావరి ఉద్ధృతి - Godavari floods latest news
పోలవరం వద్ద గోదావరి ప్రవాహం పెరిగింది. వరద పరిస్థితిని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పరిశీలించారు. నదీ పరీవాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
![పోలవరం దగ్గర కొనసాగుతున్న గోదావరి ఉద్ధృతి Godavari excerpt at Polavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8421795-121-8421795-1597414501957.jpg)
పోలవరం వద్ద గోదావరి ఉద్ధృతి