ఉభయగోదావరి జిల్లాలను కలిపే ప్రతిష్ఠాత్మక వంతెనలను మూసివేశారు అధికారులు. రోడ్డు, రైలు వంతెన, ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వంతెన నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. లాక్‌డౌన్ ప్రారంభం నుంచి ఈ వంతెనను మూసివేశారు. అయితే అత్యవసర వాహనాలను మాత్రం అనుమతించారు. గత రాత్రి వంతెన మధ్యలో కట్టిన తాడు తగిలి ఓ ల్యాబ్ టెక్నిషియన్ మృతి చెందాడు. ఈ పరిస్థితుల్లోనే ఈ రెండు వంతెనలను మూసివేసినట్లు తెలుస్తోంది.
గోదావరి వంతెనలు మూసివేత - గోదావరి వంతెనలు మూసివేత
గోదావరి నదిపై ఉన్న రోడ్డు, రైలు వంతెన, ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వంతెనలను మూసివేశారు. నాలా వంతెన పైనుంచి అత్యవసర వాహనాలకే అనుమతిస్తున్నారు.
గోదావరి వంతెనలు మూసివేత