ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థినీల కిడ్నాప్... పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం... - పశ్చిమగోదావరి జిల్లా

పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి ఇంటికి రాలేదు.. ఏమైందో తెలియదు..ఎక్కడ ఉన్నారో జాడలేదు.. స్కూలు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే... మీ పిల్లలు అసలు ఆ రోజు స్కూలు​కే రాలేదు అంటున్నారు.. అయోమయంలో పడ్డ తల్లిదండ్రులు పోలీసులును ఆశ్రయించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా  రాఘవాపురం గ్రామంలో చోటుచేసుకుంది.

పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం రేపుతున్న విద్యార్థినీల కిడ్నాప్

By

Published : Sep 5, 2019, 10:26 AM IST


పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన పగడం ఐశ్వర్య ఎనిమిదో తరగతి స్థానిక శాంతినికేతన్ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. స్కూలు దగ్గర కుమార్తెను వదిలి విధులకు వెళ్లినట్లు తండ్రి చెపుతున్నాడు. అలాగే... మరో ఇద్దరు విద్యార్థులూ స్కూలుకనే వెళ్లి ఆచూకి లేరు. ఆందోళను గురైన తల్లిదండ్రులు చింతలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు విద్యార్థులను ఆటోలో తీసుకెళ్లినట్లు గ్రామంలో కొంతమంది చూసినట్లు చెపుతున్నారు. ఎస్సై క్రాంతి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం రేపుతున్న విద్యార్థినీల కిడ్నాప్

ABOUT THE AUTHOR

...view details