పశ్చిమ గోదావరి జిల్లా బర్లమడుగు వాగులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అనూష, కవిత అనే ఇద్దరు బాలికలు దుస్తులు ఉతికేందుకు వాగు వద్దకు వెళ్లారు. బట్టలు ఉతుకుతూ... ప్రమాదవశాత్తు వాగులో పడిపోయారు. పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవటంతో నీటిలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న గ్రామస్థులు, బంధువులు వాగులో గాలించగా... చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. బాలికల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం... నీట మునిగి ఇద్దరు బాలికలు మృతి - west godavari district laest news
పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. బట్టలు ఉతకడానికి వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. ఊహించని ఈ ఘటనతో చిన్నారుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
నీట మునిగి ఇద్దరు బాలికలు మృతి