Girlfriend attacks boyfriend with blade: ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకో అని అడిగిన ప్రియుడిపై బ్లేడుతో ప్రియురాలు దాడి చేసిన ఘటన భాగ్యనగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల కిందట చోటుచేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతి, ఓ యువకుడు.. ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా నగరానికి వచ్చారు. ఓ టీ స్టాల్ వద్ద పరిచయం ఏర్పడింది. రోజూ అక్కడే కలుసుకునేవాళ్లు. ఆ కలయిక చివరికి హింసకి దారితీసింది. యువతి పథకం ప్రకారం యువకుడి గొంతు కోసే క్రమంలో చెంప కింద తీవ్ర గాయమైంది.
ప్రేమగా నటించి పీక కోసిన ప్రియురాలు..పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన లక్ష్మీ సౌమ్య(23) బీబీఏ పూర్తి చేసి ఉద్యోగం కోసం కేపీహెచ్‌బీకి వచ్చి నాలుగో రోడ్డులోని ఓ ప్రైవేటు వసతిగృహంలో చేరింది. ఇక్కడికి సమీపంలోనే గుంటూరుకు చెందిన అశోక్‌కుమార్ మరో ప్రైవేటు వసతిగృహంలో ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. వీరిద్దరికి అదే రోడ్డులోని ఓ టీ స్టాల్ వద్ద పరిచయం ఏర్పడింది. అలా 6 నెలల పరిచయంతో అశోక్ పెళ్లి చేసుకుంటానని సౌమ్యతో ప్రస్తావించాడు. ఆమె మనసులో ఏముందో తెలియదు గానీ అశోక్‌తో ప్రేమగా ఉంటున్నట్లు నటించేది.