పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం కొత్తూరుకు చెందిన ఓ బాలిక.. అదే గ్రామంలోని సెల్ఫోన్ దుకాణంలో పనిచేస్తోంది. ఇటీవల తరచుగా చరవాణిలో మాట్లాడుతున్నట్లు బాలికను గమనించిన తల్లిదండ్రులు.. ఆమెను మందలించారు.
మనస్థాపానికి గురైన బాలిక గురువారం రాత్రి పురుగుల మందు తాగింది. కుటుంబీకులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందితూ బాలిక మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.