పశ్చిమగోదావరి జిల్లాలోని అమ్మవారి ఆలయాలు.. ఉత్సవశోభను సంతరించుకున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవాలు మూడో రోజు సందర్బంగా.. తణుకు మండలం దువ్వ గ్రామంలో.. ఉన్న శ్రీ దానేశ్వరి అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
అమ్మవారిని గాయత్రీ దేవి అలంకారంలో దర్శించిన వారికి.. వాక్ శుద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని.. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.