తాగునీటి బోరు నుంచి గ్యాస్ లీకేజీ కావడం... స్థానికులలో భయాందోళన కలిగిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం పాలకొల్లు రహదారిలోని.. బొక్క సత్యనారాయణ తన ఇంటి ఆవరణలో ఏడాది క్రితం మంచినీరు బోరు వేయించారు. సుమారు ఆరు నెలల నుంచి వినియోగించడం మానేశారు.
వేసవి కారణంగా తాగునీటి సమస్య తలెత్తడంతో బుధవారం ఉదయం బోరుకు మరమ్మతులు చేపట్టారు. భూమిలోని గొట్టాలు లాగుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో గ్యాస్ బయటకు వెలువడటంతో.. స్థానికులంతా భయంతో పరుగులు తీశారు.