కుల మతాలకు అతీతంగా నిర్వహించుకునే వన భోజనాల సంస్కృతిని రాజకీయ నాయకులు కుల భోజనాలుగా మార్చేశారని జనసేన రాష్ట్ర సమన్వయ కమిటీ ఛైర్మన్ నాగబాబు అన్నారు. ఇలాంటి పరిస్థితిని మార్చేందుకు వర్గాలకు అతీతంగా అన్ని సామాజికవర్గాలతో కలిపి వన భోజనం ఏర్పాటు చేశామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక వనభోజనానికి నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కచ్చులూరులో నీట మునిగిన బోటును... బయటికి తీసిన ధర్మాడి సత్యంతో పాటు, 22 మంది ప్రాణాలు కాపాడిన కచ్చులూరు గ్రామస్థులను ఘనంగా సన్మానించారు. తమ పార్టీ రాష్ట్ర ప్రజల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు.
జనసేన వన భోజనం.. కులమతాలకు అతీతం: నాగబాబు - vanabojanalu programme in narsapuram
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జనసేన పార్టీ... వనభోజనాలు నిర్వహించింది. పార్టీ జనసేన రాష్ట్ర సమన్యయ కమిటీ ఛైర్మన్ నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నర్సాపురంలో జనసేన వనభోజనాలు