పశ్చిమగోదావరి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దృష్టి పెట్టారు. జిల్లాలో ఇప్పటి వరకు 6 గంజాయి కేసులు తాజాగా నమోదు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీ కరీముల్లా షరీఫ్ తెలిపారు. జీలుగుమిల్లి వద్ద పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో 2వేల కిలోల మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర గోరాయి ప్రాంతానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ముగ్గురిలో సోమేశ్వర గతంలోనూ గంజాయి అక్రమ రవాణా చేసేవాడని.. అతనితోపాటు సిద్దేశ్వర్ ప్రదీప్ లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. జిల్లాలో అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఏఎస్పీ కరీముల్లా షరీఫ్ స్పష్టం చేశారు.
గంజాయి అక్రమ రవాణాపై నిఘా.. 2వేల కిలోల మత్తుపదార్థాలు స్వాధీనం
గంజాయి అక్రమ రవాణాపై పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో విస్తృత దాడులు నిర్వహిస్తున్నారు. జీలుగుమిల్లి వద్ద పెద్ద ఎత్తున గంజాయి పట్టుకున్నారు.
ganjai Smuggling