ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహాత్ముడు నాటిన మొక్క... ఏలూరుకు నీడ

మారణాయుధాలు చేతపట్టకుండానే... సత్యం, అహింసా మార్గాల ద్వారా దేశానికి స్వాతంత్ర ఫలాలు అందించిన ఘనత బాపూజీది. గాంధీజీ మాటలు, చేతలు, ఉద్యమం... దేశానికి ఎన్నటికీ చిరస్మరణీయం. మహాత్ముడి మార్గాలు అనుసరణీయం. అలనాటి శాంతిస్వరూపుడి గుర్తులు... ఇప్పటికీ తెలుగు నేలను పునీతం చేస్తున్నాయి.

gandhiji slaped tree at westgodari district

By

Published : Oct 2, 2019, 6:32 AM IST

మహాత్ముడు నాటిన మొక్క... ఏలూరుకు నీడ
సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు పట్టణానికి బాపూ 1921లో వచ్చారు. శ్రీ మార్కండేయ ఆలయంలో చిన్న పిల్లలకు విద్యాభ్యాసం చేయించి... కెనాల్ రోడ్​లో శ్రీ గాంధీ ఆంధ్ర జాతీయ మహా విద్యాలయాన్ని స్థాపించారు. ఆ తర్వాత కొంతకాలం బ్రిటిష్ పాలకులు ఆ పాఠశాలలో కార్యకలాపాలు నిలిపివేశారు. ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో భాగంగా గాంధీజీ 1934లో మళ్లీ ఏలూరు వచ్చారు. ఆ పాఠశాలను తిరిగి ప్రారంభించారు. ఆ సమయంలో పాఠశాల ఆవరణంలో మేడి చెట్టు నాటారు. ఆ చెట్టు ఇప్పటికీ గాంధీజీ జ్ఞాపకంగా ఉంది. ఈ పాఠశాల దినదినాభివృద్ధి చెందుతూ... ఎంతోమంది విద్యార్థులకు విద్యనందిస్తోంది. మహాత్ముడు నాటిన మొక్కను పరిరక్షించుకుంటూ... బాపూ జ్ఞాపకాన్ని పదిలం చేస్తున్నారు జిల్లా వాసులు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details