మూడు నెలలు ఉచితంగా రేషన్ : జేసీ - పశ్చిమగోదావరి జిల్లాలో ఉచిత రేషన్ పంపిణీ న్యూస్
పశ్చిమగోదావరి జిల్లాలోని బియ్యం కార్డుదారులు అందరికీ మూడు నెలలపాటు ఉచితంగా రేషన్ సరకులు పంపిణీ చేయనున్నట్లు జేసీ వెంకటరమణారెడ్డి వెల్లడించారు. వాలంటీర్లు ఇచ్చిన నిర్దేశిత సమయంలో రేషన్ దుకాణాల వద్ద సరుకులు పొందవచ్చని తెలిపారు.
![మూడు నెలలు ఉచితంగా రేషన్ : జేసీ మూడు నెలలు ఉచితంగా రేషన్ : జేసీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6591144-1039-6591144-1585538026799.jpg)
మూడు నెలలు ఉచితంగా రేషన్ : జేసీ
పశ్చిమగోదావరి జిల్లాలోని బియ్యం కార్డుదారులు అందరికీ మూడు నెలలపాటు ఉచితంగా రేషన్ సరకులు పంపిణీ చేయనున్నట్లు జేసీ వెంకటరమణారెడ్డి తెలిపారు. తంగెళ్లమూడి పంచాయతీ కార్యాలయం వద్ద పేదలకు ఉచిత రేషన్ సరకుల పంపిణీ తీరును ఆయన పరిశీలించారు. బియ్యం కార్డుదారులు రేషన్ సరకుల కోసం ఇబ్బందిపడాల్సిన అవసరం లేదని చెప్పారు. వాలంటీర్లు ఇచ్చిన నిర్దేశిత సమయంలో రేషన్ దుకాణాల వద్ద సరకులు పొందవచ్చన్నారు.