ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళా సంఘాల రిజిస్ట్రేషన్ పేరిట మోసం! - పశ్చిమగోదావరి జిల్లాలో ఘరానా మోసం వార్తలు

అమాయకమైన మహిళలను లక్ష్యంగా చేసుకొని మోసం చేసేందుకు కొందరు దళారులు వల పన్నారు. మారుమూల గ్రామాలకు చెందిన వారిని ఇట్టే మోసం చేయవచ్చని అనుకున్నారు. రిజిస్టర్ అయిన మహిళా సంఘాలకు పదివేల రూపాయలు ఇప్పిస్తామంటూ మోసింగించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని టీ నర్సాపురం మండలం పరిధిలో వెలుగు చూసింది

Fraud in the name of registration of women's associations in westgodavari district

By

Published : Nov 6, 2019, 9:10 AM IST

పశ్చిమగోదావరి జిల్లా టీ.నర్సాపురం మండల పరిధిలోని వెంకటాపురం, శ్రీరామవరం గ్రామాలకు చెందిన మహిళలను.. గుర్తుతెలియని కొంతమంది మోసం చేసేందుకు యత్నించారు. మహిళా సంఘాలుగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే పదివేలు రూపాయలు ఇప్పిస్తామని ఆశ చూపారు. ఇలా ప్రతి సంవత్సరం పది వేల రూపాయల చొప్పున ఇస్తారు అని నమ్మ బలికారు. ఇది నమ్మి.. గ్రామానికి చెందిన కొంత మంది ఏలూరుకు వచ్చి కంప్యూటర్ సెంటర్ల వద్ద సంఘ బైలాలు తయారు చేయించుకుని రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇది ఆ నోటా ఈ నోటా టీ నర్సాపురం మండలమంతా వ్యాప్తి చెందింది. ఆటోల్లో మహిళులు అధిక సంఖ్యలో వచ్చి కంప్యూటర్ సెంటర్ వద్ద బారులు తీరారు. ఇందులో వాస్తవం లేదని కొందరు నాయకులు గుర్తించారు. మరికొందరు మాత్రం ఆటో డ్రైవర్లకు ఇచ్చినట్లు తమకు కూడా ఇస్తారని ఆశతో ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అసలు ఈ విషయాన్ని ఎవరు చెప్పారో మహిళలు మాత్రం చెప్పడం లేదు.

రిజిస్ట్రార్ కార్యాలయంలో బయట ఉండే ఓ మహిళ ఇటువంటి సంఘాలకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయమై సదరు మహిళను బాధిత మహిళలు అందరూ గట్టిగా నిలదీశారు. రూ. 10వేల ఆర్థిక సాయం ఎలా సాయం చేస్తారని అడ్డగా మహిళ మాత్రం ఆ విషయం గురించి తనకు తెలియదని, కేవలం వారు కోరితేనే సంఘాల రిజిస్ట్రేషన్ సంబంధించిన సమాచారాన్ని తయారు చేసి ఇచ్చామని తెలిపింది. ఇందులో కొందరు గ్రూపునకు రూ. 3వేల వరకు ఓ దళారికి ఇచ్చినట్లు తెలిపారు. తీరా అటువంటి ఆర్థిక సాయం అంటూ ఏదీ లేదని తెలుసుకున్న మహిళలు తాము మోసపోయామని గ్రహించి తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై ఇప్పటివరకూ ఎటువంటి కేసు నమోదు కాలేదు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details