ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

STUDENTS DEATHS: అక్కడ విద్యార్థుల వరుస మరణాలు.. అసలేం జరిగిందంటే.. - కొయ్యలగూడెంలో విద్యార్థుల వరుస మరణాలు

STUDENTS DEATHS: పశ్చిమగోదావరి జిల్లాలో విద్యార్థుల వరుస మరణాలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతుచిక్కిని వ్యాధిని వెంటనే కనిపెట్టాలని కోరుతున్నారు. ప్రస్తుతం సుమారు 50 మంది పిల్లలు జ్వరాలతో బాధపడుతున్నట్లు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

STUDENTS DEATHS
STUDENTS DEATHS

By

Published : Dec 6, 2021, 3:11 AM IST

Updated : Dec 6, 2021, 3:48 AM IST

విద్యార్థుల వరుస మరణాలతో తల్లిదండ్రుల ఆందోళన

STUDENTS DEATHS WITH UNIDENTIFIED DISEASE: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో విద్యార్థుల వరుస మరణాలు గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతుపట్టని వ్యాధితో ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా... తాజాగా మరో విద్యార్థి మరణించారు. దీంతో గ్రామంలో ఏం జరుగుతుందో తెలియని అమోమయస్థితిలో పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు.

వరుస మరణాలు సంభవిస్తుందడతో తల్లిదండ్రులు తల్లడిల్లి పోతున్నారు. మరణించిన విద్యార్థులంతా మొదట జ్వరంతో బాధపడినా... తర్వాత ఇతర సమస్యలు తలెత్తాయి. తలనొప్పి, వాంతులు, రక్తకణాలు క్షీణించినట్లు వైద్యులు తెలిపారని విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పారు. అధికారులు వైద్య శిబిరం పెట్టి పరీక్షలు నిర్వహించినా.. సీజనల్‌ జ్వరాలని చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 50 మంది పిల్లలు జ్వరాలతో బాధపడుతున్నట్లు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

అయితే అధికారులు ఈ మ‌ర‌ణాల‌కు సంబంధించి కార‌ణాలు స్ప‌ష్టంగా చెప్ప‌క పోవ‌డంతో గ్రామస్తుల్లో మ‌రింత ఆందోళ‌న మొద‌లైంది. అసలు ఈ అనారోగ్యాలకు ఆహారం విష‌తుల్యం కావటం, తాగునీరు క‌లుషితం వంటివి కార‌ణాలు అయి ఉంటాయ‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సిబ్బంది ర‌క్త‌న‌మూనాలు సేక‌రించినా.. వాటి వివ‌రాలు వెల్లడించటం లేదని ప‌లువురు అక్కడి వారు అధికారుల‌ను నిల‌దీస్తున్నారు.

ఇదీ చదవండి:

jawad cyclone effect: ఉప్పాడ తీరంలో అలల ఉద్ధృతి.. బీచ్​రోడ్డులో రాకపోకలు నిలిపివేత!

Last Updated : Dec 6, 2021, 3:48 AM IST

ABOUT THE AUTHOR

...view details