ACCIDENT : తాడేపల్లిగూడెంలో లారీ బోల్తా.. నలుగురు మృతి - tadepalligudem crime
07:40 January 14
డ్రైవర్ మద్యం మత్తే ప్రమాదానికి కారణంగా భావిస్తున్న పోలీసులు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎన్ఐటీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడి నలుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వీరంతా పశ్చిమ బంగ రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.
విశాఖపట్నం జిల్లా దువ్వాడ నుంచి ఉంగుటూరు మండలం నారాయణపురం డీఎఫ్ఎస్ ఐస్ ఫ్యాక్టరీకి చేపలు తరలిస్తున్న లారీ.. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. ఏడుగురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 14 మంది ఉన్నారు. వాహనం డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని లారీని బయటకు తీస్తున్నారు. జాతీయ రహదారి సిబ్బంది, పట్టణ, రూరల్ పోలీసుల సహాయంతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు రూరల్ సీఐ రవి కుమార్ తెలిపారు.
ఇదీచదవండి.