ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా

ధాన్యం కొనుగోలు సమస్యలు, వరి కోత యంత్రాల కిరాయిలు నియంత్రించాలని కోరుతూ ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు.

ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా
ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా

By

Published : Nov 16, 2020, 7:02 PM IST

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. వరి కోత యంత్రాల కిరాయిలు నియంత్రించాలని, ధాన్యం కొనుగోలు సమస్యలను త్వరగా పరిష్కరించాలని నినాదాలు చేశారు. భారీ వర్షాలకు వరి చేలు నేలకొరిగాయని ఫలితంగా ఎకరానికి 3 గంటల సమయం పడుతుందన్నారు.

వరి కోత యంత్రాల నిర్వహకులు గంటకు రూ.3 వేలు ఇస్తేనే కోతలు చేపడుతున్నారని రైతులు వాపోయారు. చైను యంత్రానికి రూ.2 వేలు, టైర్లు ఉన్న యంత్రానికి రూ. 1500 తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరుచుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం లెక్కింపు, తూకాల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

జగన్​ లేఖ కేసు విచారణ ధర్మాసనం నుంచి తప్పుకున్న జస్టిస్ లలిత్ కుమార్

ABOUT THE AUTHOR

...view details