ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికార పార్టీ నేతలు ప్రలోభ పెడుతున్నారు - నిడదవోలులో సమావేశం నిర్వహించిన బూరుగుపల్లి శేషారావు

పురపాలక సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను ప్రలోభ పెడుతున్నారని.. తెదేపా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆరోపించారు. తమ పార్టీ నేతలు వాటన్నింటిని ఎదురొద్ది నిలిచారని అభినందించారు.

Former TDP MLA Burugupalli Shesharao
అధికార పార్టీ నేతలు ప్రలోభ పెడుతున్నారు

By

Published : Mar 4, 2021, 1:33 PM IST

మున్సిపల్​ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను ప్రలోభ పెడుతున్నారని.. తెదేపా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పుర ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అధికార పార్టీ వారు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, బెదిరించినా.. తమ పార్టీ అభ్యర్థులు క్రమశిక్షణకు లోబడి ఎదురొడ్డి నిలిచారని అభినందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు నిజాయితీ గల తమ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details